Header Banner

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

  Wed May 14, 2025 12:06        Politics

విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొచ్చాయి. ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశమయ్యారు. స‌మావేశానికి KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజ‌రయ్యారు. విజ‌య‌వాడ‌లో ప్రతిపాదిత మెట్రో కారిడార్​ల‌ను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు ప‌రిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్​ల‌కు అయ్యే వ్యయంలో రూ.12,000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజ‌య‌వాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు. త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్రదింపులు జ‌రుపుతున్నారు. త్వర‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చ‌ర్చలు జ‌ర‌ప‌నున్నట్లు సమాచారం. రెండు న‌గ‌రాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వేగంగా ముందుకు వెళ్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్​కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్‌, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్‌, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్‌ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్‌ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్​లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్ 1ఏ, 1బి లను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్​లో ప్రతిపాదించారు. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్​ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations